సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

కలం, వెబ్ డెస్క్: అర్నబ్ తుఫాన్ కారణంగా ప్రభావితమైన జిల్లాల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఏరియల్ సర్వే చేపట్టారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో జరిగిన నష్టాలను పరిశీలించారు. ఈ మూడు జిల్లాల్లో అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిమ్మకూరు, పామర్రు, ఏలూరు, బంటుమిల్లిలో పంట నష్టం వివరాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పంట నష్టం అంచనాలను నివేదిక రూపంలో పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.

క్షేత్ర స్థాయిలోకి వెళ్లి స్వయంగా రైతులను అడిగి.. నష్టం వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కోనసీమ జిల్లా గచ్ఛకాయపురంలో వరద బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మరికాసేపట్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సందర్శించబోతున్నారు. వరద బాధితులకు నిరంతరం సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

Also Read : బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>