మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే బాలు నాయక్

కలం, దేవరకొండ: గ్రామాల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం, పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) అన్నారు. గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొండభీమనపల్లి (Kondabheemanapally) గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల సమావేశాలు, స్వయం సహాయక సంఘాల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

అనంతరం గిరిజానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పేద కుటుంబాలకు సొంత ఇల్లు లభించడం కేవలం వసతి మాత్రమే కాకుండా, ఆత్మగౌరవాన్ని, భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నారు. రెండు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు తదితర మౌలిక వసతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల సార్వత్రిక అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆలంపల్లి నర్సింహా, మారుపాకుల సురేష్ గౌడ్, లోకసాని శ్రీధర్ రెడ్డి, హనుమంతు, వెంకటేష్ గౌడ్, కొర్ర రాంసింగ్, కిన్నెర హరికృష్ణ, కొన్రెడ్డి శ్రీను, నేనావత్ బుజ్జిభాయి హరిలాల్, వంగూరు రాజు గౌడ్లతో పాటు మండల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నది ముఖ్యం: టీపీసీసీ చీఫ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>