ఏపీలో దారుణం.. బస్సు డ్రైవర్‌ను వెంబడించి కొట్టిన యువకులు

కలం, వెబ్‌ డెస్క్‌ : బస్సును ఆపలేదన్న కారణంతో ఆర్టీసీ డ్రైవర్‌ (RTC Driver) పై కొందరు యువకులు దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి కదిరికి ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకులు దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లిలో(Maddaiahgaripalle) బస్సును ఆపాలని కొందరు యువకులు డ్రైవర్‌ను కోరినట్లు సమాచారం.

అయితే బస్సు ఆపకపోవడంతో ఆగ్రహానికి గురైన యువకులు బైకులపై బస్సును వెంబడించారు. అనంతరం డ్రైవర్‌ను బస్సు నుంచి కిందకు దించి విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రజా రవాణా సేవలు అందించే డ్రైవర్‌పై ఈ విధంగా దాడికి దిగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్న కారణంతోనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దాడికి గురైన డ్రైవర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విశ్వనాథ్, రాము, మధు కుమార్ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి తదుపరి చర్యలు చేపడుతున్నారు. ప్రజా రవాణా సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>