డిప్యూటీ సీఎం కీలక ఆదేశం.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్!

కలం, వెబ్ డెస్క్ : అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో అంటువ్యాధుల నివారణ, పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలలో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశాల మేరకు 475 మంది సిబ్బందితో 100 ప్రత్యేక బృందాలను (Sanitation Task Force) రంగంలోకి దించారు.

ఈ రెండు జిల్లాలలో కోనసీమకు 55, పశ్చిమ గోదావరికి 45 బృందాలను కేటాయించి, తొమ్మిది జిల్లాల నుంచి సిబ్బందిని సమకూర్చారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించడం, మురుగు కాలువల శుభ్రత, బ్లీచింగ్, క్లోరినేషన్ పనులను ఈ బృందాలు నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు.

అలాగే, తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సురక్షిత తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వాటర్ టెస్టింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల కోసం డీఈలు, ఏఈలు, కెమిస్టులు, మైక్రోబయాలజిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో కూడిన 48 మంది సాంకేతిక సిబ్బందిని నియమించారు.

ఈ బృందాలు (Sanitation Task Force) క్షేత్రస్థాయిలో తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ, కలుషిత నీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామాలలో పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఈ సహాయక పునరుద్ధరణ చర్యలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read : ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ… కీలక నిర్ణయాలివే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>