గంభీర్ కోచింగ్‌పై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్ : హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అందించిన వ్యూహాత్మక దిశానిర్దేశమే తమ సిరీస్ విజయాధిపత్యానికి ప్రధాన కారణమని భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) స్పష్టం చేశారు. ఈ సుదీర్ఘ పర్యటనలో టీ20 మ్యాచ్‌లలో సాధించే విజయోత్సాహం, ఆ తర్వాత జరగబోయే వన్డే, టెస్టు సిరీస్‌లకు బలాన్నిస్తుందని గంభీర్ ముందే తేల్చిచెప్పారని ఆయన వెల్లడించారు. ఈ ఊపుతోనే మిగిలిన మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఎంత నిరంతర ప్రయాణం ఉన్నా అలసటను ఒక నెపంగా చెప్పకూడదని తిలక్ వర్మ తెలిపారు. జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలవడమే తమ బాధ్యత అని పేర్కొన్నారు. మైదానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు చిన్నచిన్న విషయాల్లో తోడ్పడటం వల్ల జట్టుకు ఆశించిన సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో లేదా ఆరో స్థానానికి మారడంపై స్పందిస్తూ, తనకు పవర్ హిట్టింగ్ సామర్థ్యం ఉందన్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడమే తన వ్యూహమని వివరించారు. గంభీర్ మార్గదర్శకంలో జట్టు అంతా ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తిలక్ వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>