కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీయస్ పోలీస్ స్టేషన్ యందు నిజామాబాద్ జిల్లా ట్రాన్స్‌జెండర్లకు(Transgenders)సీసీయస్ ఏసీపీ శ్రీశైలం (ACP Srisailam) కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీశైలం మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా న్యూసెన్స్‌కు పాల్పడకుండా శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించేందుకు కృషి చేయాలని , చట్టవిరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న వ్యక్తిగత , సామాజిక సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత మార్గాల్లో సహాయం పొందాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా చట్టాన్ని ఆశ్రయించాలని , ఎవరూ నిరుత్సాహానికి గురికాకుండా గౌరవప్రదమైన జీవనం కొనసాగించాలని తెలిపారు.
ట్రాన్స్‌జెండర్లకు (Transgenders) ఏవైనా సమస్యలు , ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 14427ను సంప్రదించాలని సూచించారు. ప్రజల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు , ట్రాన్స్‌జెండర్ల సమస్యలను తెలుసుకొని వారికి తగిన మార్గదర్శకత్వం అందించడమే ఈ కౌన్సెలింగ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
Also Read : స్టాక్ మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫార్మ్స్ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ!
Follow Us On : WhatsApp

