భారత్‌లో లీటెన్‌స్టైన్ ప్రిన్స్ అలోయిస్ పర్యటన

కలం, వెబ్ డెస్క్ : భారతదేశంలో లిటెన్‌స్టెయిన్ తొలి అధికారిక పర్యటన అట్టహాసంగా ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో లిటెన్‌స్టెయిన్ వారసత్వ యువరాజు హెరిడిటరీ ప్రిన్స్ అలోయిస్ (Prince Alois), ఆయన సతీమణి హెరిడిటరీ ప్రిన్సెస్ సోఫీలకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ఉన్నతాధికార ప్రతినిధుల బృందాలు పరస్పరం పరిచయం చేసుకున్నాయి.

భారత్‌తో తమ దేశ సంబంధాలకు ఈ చారిత్రాత్మక పర్యటన ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని ప్రిన్స్ అలోయిస్ (Prince Alois) తెలిపారు. ఒక సంవత్సరం క్రితం అమల్లోకి వచ్చిన వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (TEPA) ఇరు దేశాల సంబంధాలలో మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ఇన్నోవేషన్, అధునాతన తయారీ రంగం, ఆర్థిక సేవలు, విద్య, సాంకేతికత రంగాల్లో ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు అపారమైన అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : అస్సాంలో దారుణం: హోటల్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>