మహిళా సంఘానికి కొత్త భవనం.. ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

కలం, బూర్గంపాడు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం (Lakshmipuram) గ్రామంలో వెన్నెల జ్యోతి గ్రామ మహిళా సంఘం నూతన భవనాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (MLA Payam Venkateswarlu) సోమవారం ప్రారంభించారు. సర్పంచ్ బాదం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్, పలువురు ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.

రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ భవనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడో మహిళా సంఘ భవనం కావడం విశేషం. నూతన భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ మహిళలు సంఘ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు మరింత సౌకర్యం కలిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండగా ఉంటారని తెలిపారు. అనంతరం సర్పంచ్ బాదం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో లక్ష్మీపురం గ్రామపంచాయతీని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో ముందంజలో నిలిచేలా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>