బాణాసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి : సీపీ శ్వేత

కలం, హనుమకొండ : దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే వారు నవంబర్‌ 2వ తేదీలోగా సంబంధిత డీసీపీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని వరంగల్‌ సీపీ ఎన్‌. శ్వేత (Warangal CP Swetha) సూచించారు. పూర్తి వివరాలతో అవసరమైన ధ్రువపత్రాలను జతచేయాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

దరఖాస్తుతో పాటు అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ, స్థల యజమాని లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి అనుమతి పత్రం, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, గతంలో లైసెన్స్‌ ఉంటే దాని ప్రతిని సమర్పించాలి. అవసరమైన చోట్ల పక్క స్థల యజమానుల అనుమతి పత్రాలు, స్థల నమూనా బ్లూప్రింట్‌ను జతచేయాలి. ఎస్‌బీఐ ఆధాలత్‌ శాఖలో ప్రభుత్వ ఖజానాకు రూ.800 చెల్లించిన బ్యాంకు చలాన్‌ను కూడా దరఖాస్తుతో పాటు అందించాలి.

దరఖాస్తులను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం సంబంధిత డీసీపీ స్థాయి అధికారులు అనుమతులు జారీ చేస్తారని సీపీ (Warangal CP) తెలిపారు. అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>