కేశంపేట పాఠశాలలో చోరీ.. గ్యాస్ సిలిండర్, పప్పు దినుసులు మాయం!

కలం, వనపర్తి: కేశంపేట ప్రాథమికోన్నత పాఠశాల (Keshampet School) లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పాఠశాల ఆవరణలోని కిచెన్‌ షెడ్‌ తాళాలు పగలగొట్టి మధ్యాహ్న భోజనానికి వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌, 25 కిలోల పప్పు దినుసులు, ఇతర వంటసామగ్రిని అపహరించారు. అంతేకాకుండా పాఠశాల ఆవరణలోని బాత్రూం తాళాలను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారు. ఉదయం పాఠశాలకు వచ్చిన వంట సిబ్బంది కిచెన్‌ షెడ్‌ తాళాలు పగలగొట్టి ఉండటాన్ని, సామగ్రి కనిపించకపోవడాన్ని గుర్తించి ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్‌కు సమాచారం అందించారు.

దీంతో హెచ్‌ఎం, గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు, వంట సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించడంతోపాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది సిద్ధమవుతున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు వినియోగించే సామగ్రి చోరీకి గురికావడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పోలీసులు స్పందించి దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలలో రాత్రివేళ భద్రతను పటిష్ఠం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>