పత్తి చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

కలం, ఖమ్మం బ్యూరో : జిల్లాలోని కూసుమంచి (Kusumanchi Bus Accident ) మండలం లింగన్న తండా వద్ద సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పత్తి చేనులోకి దూసుకెళ్లిన ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున బస్సు అకస్మాత్తుగా రోడ్డు పక్కనే ఉన్న పత్తి చేనులోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

​ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలైనట్లు సమాచారం అందగా, స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. అయితే, బస్సు అతివేగంగా నడపడం వల్లనే డ్రైవర్ అదుపు కోల్పోయి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, క్షతగాత్రుల వివరాలు అధికారుల నుంచి తెలియాల్సి ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>