కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అలయ్ బలయ్ (Alai Balai) వంటి కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచర సమితి ఆధ్వర్యంలో నగరంలోని గడియారం చౌరస్తా వద్ద ఆదివారం ఏర్పాటుచేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రజలందరూ కలిసికట్టుగా, పరస్పర గౌరవంతో మెలుగుతూ మహబూబ్నగర్ నగర ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన (Yennam Srinivas Reddy) మాట్లాడుతూ, అయ్యప్ప దీక్షా చేపట్టి మండల కాలం పాటు భగవంతున్ని ఆరాధిస్తూ సర్వేజనా సుఖినోభవంతు అని నిరంతరం అయ్యప్ప స్వామి శరణ ఘోషతో అందరినీ ఆధ్యాత్మికత వైపు నడిపించే అయ్యప్ప స్వాములు, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచర సమితి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఒకచోట చేరి పండుగలు, సంప్రదాయాలను జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలోని గొప్పతనాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో పరస్పర స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ నగర అభివృద్ధికి, ప్రతిష్ట పెంపునకు తమ వంతు సహకారం అందించాలని ఆయన ఆకాంక్షించారు. అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించిన అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి, పాలమూరు శాఖ ప్రతినిధులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు రఘు యాదవ్, ప్రశాంత్, పాతూరి రమేష్ బాబు, అనుప ఆంజనేయులు, కిషన్ నాయక్, గోవర్థన్ గౌడ్, నాయకులు రమేష్ యాదవ్, సతీష్ కుమార్ .జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజు దేశపాండే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సీమా నరేందర్, నరేందర్ గుప్త, పాలమూరు జిల్లా అధ్యక్షులు భాను ప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఆరెళ్ళ రమేష్, అన్నధాన కమిటీ ప్రధాన కార్యదర్శి మంత రవి జె. శంకర్, కోశాధికారి రాపర్తి శ్రీను,నగర కమిటీ అధ్యక్షులు నర్సింహారావు , ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్, కోశాధికారి బాల ప్రసాద్ కార్యవర్గ సభ్యులు కొండల్, సంతోష్, కుర్మయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Also Read : ‘మన్ కీ బాత్’లో ‘కొమురం భీమ్’ స్మరణ గర్వకారణం: కలెక్టర్ రాజర్షి షా
Follow Us On : WhatsApp

