సౌదీకి వెళ్తున్నారా?.. కేంద్రం కీలక హెచ్చరికలు

కలం, వెబ్ డెస్క్: ఇండియా నుంచి సౌదీ అరేబియా(Saudi Arabia)కు వెళ్లాలనుకునేవారు వీలైతే తమ ప్రయాణాన్ని కొంత కాలం వాయిదా వేసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) సూచించింది. తప్పనిసరై వెళ్లాలనుకుంటే మాత్రం జాగ్రత్తలు పాటించాలని కోరింది. గడిచిన 12 గంటల్లో ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో 11 బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్ల దాడులు జరిగినట్లు వెల్లడించింది. రియాద్, దమ్మామ్ ఎయిర్‌పోర్టులకు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులను నవంబర్ 7వ తేదీ వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించాయని తెలిపింది. అదే సమయంలో జెడ్డా ఎయిర్‌పోర్టుకు అక్టోబర్ 31 వరకు ఎలాంటి విమానాలు రాకపోకలు సాగించవని పేర్కొంది.

వీడియోలు షేర్ చేయొద్దు..

సౌదీలో ఉంటున్న భారతీయులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. దాడులకు సంబంధించిన ఎలాంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని సూచించింది. అలాగే భద్రతా పరంగా సున్నితమైన ప్రాంతాల ఫొటోలు, వీడియోలు తీయవద్దని కూడా పేర్కొంది. అలా చేస్తే.. లీగల్ ఇబ్బందులు తప్పవని, సౌదీ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. అక్కడ భారతీయ ఎంబసీ ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలని, ఏమరుపాటుగా ఉండొద్దని వివరించింది.

Also Read : దేశాన్ని కాపాడుకుందాం: రాహుల్ గాంధీ సంచలన పిలుపు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>