దేశాన్ని కాపాడుకుందాం: రాహుల్ గాంధీ సంచలన పిలుపు

కలం, వెబ్ డెస్క్ : నవంబరు 1న దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లో ‘ఇండియా’ కూటమి నిర్వహించనున్న ‘ఓటును కాపాడండి… దేశాన్ని కాపాడండి’ మెగా ర్యాలీకి భారీగా తరలిరావాలని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య సూత్రాలను, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి చేపడుతున్న ఈ ‘ఛలో ఢిల్లీ’ జన మార్చ్ కార్యక్రమానికి విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువతతో పాటు వ్యాపారులు, సాధారణ పౌరులందరూ విధిగా హాజరుకావాలని ఆయన కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రకటన విడుదల చేశారు.

ఓటర్ల జాబితాల రూపకల్పన, ప్రత్యేక సవరణ ప్రక్రియల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది మంది ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఓట్ల తొలగింపు అక్రమాలపై ప్రశ్నించిన పౌరులు, ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రభుత్వ యంత్రాంగం లాఠీఛార్జీలు చేస్తూ అణచివేతకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. మన ప్రాథమిక ఓటు హక్కును అన్యాయంగా లాక్కోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను చూస్తూ ఊరుకునేది లేదని తేల్చిచెప్పిన ఆయన, “ఓటు మీదే… దాని కోసం చేయాల్సిన పోరాటం కూడా మీదే” అని స్పష్టం చేస్తూ, ఈ ప్రజాస్వామ్య పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.

కాగా, ఎన్నికల సంఘం తీరుకు మరియు ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు నిరసనగా ‘ఇండియా’ కూటమి నిర్వహిస్తున్న ఈ నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలందరూ అక్టోబర్ 30 నుంచి నవంబరు 1 వరకు ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తూ… నవంబరు 1 చేపట్టనున్న ర్యాలీకి దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి.

Also Read : సైబర్ దాడి.. స్తంభించిన TG-iPASS పోర్టల్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>