epaper
Tuesday, November 18, 2025
epaper

‘మద్యం ఆదాయంపై ద్యాస తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదా..?’

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఘాటు విమర్శలు చేశారు. మద్యం దుకాణాలపై వచ్చే ఆదాయంపై ద్యాసే తప్ప ఈ సర్కార్‌కు ప్రజల ఆరోగ్యంపై ఇసుమంత కూడా శ్రద్ధ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తే, ఈ ప్రభుత్వం వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా దవాఖానా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందంటూ విమర్శించారు. ‘‘కొత్త వైన్ షాపుల అప్లికేషన్ ఫీజు 2 లక్షల నుండి 3 లక్షలు పెంచాడు. దరఖాస్తులు తక్కువ వచ్చాయని వారం రోజులు గడువు పెంచిండు. మద్యం దుకాణాల మీద ఆదాయం మీద ధ్యాస తప్ప ప్రజల ఆరోగ్యం శ్రద్ద లేదా? కేసీఆర్ కిట్ ఎందుకు రావడం లేదు, బస్తీ దవాఖానలో మందులు ఎందుకు లేవు, వాళ్లకి జీతాలు ఎందుకు వస్తలేవని ఒక్క నాడు అయినా రివ్యూ చేశావా. మద్యం దుకాణాల గురించి తప్ప గరీబ్ వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడటం లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్తీ ప్రజలకు తమ గడప దగ్గరే వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. నాడు కేసీఆర్.. రాష్ట్రం మొత్తంలో 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. వాటిలో 110 రకాల మందులను, 134 రకాల టెస్టులను ఉచితంగా చేసేవారు. కానీ 22 నెలల కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకే(Basti Dawakhan) సుస్తీ పట్టుకున్నది. లింగంపల్లిలో ఉన్న బస్తీ దవాఖానా సిబ్బంది తమకు 5-6 నెలల నుండి జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు. నిత్యావసరమైన మందులు కూడా అందుబాటులో లేవు. రేవంత్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జూబ్లీహిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేస్తే బస్తీ దవాఖానలలో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేసారు అనుకుంటాడు. ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలి. రేవంత్ రెడ్డి సర్కార్ కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలి’’ అని Harish Rao ప్రజలను కోరారు.

Read Also: జపాన్‌కు తొలి మహిళా ప్రధాని.. రికార్డ్ సృష్టించిన తకైచి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>