కలం వెబ్ డెస్క్ : అమెరికా(America)లోని మేరీల్యాండ్(Maryland) రాష్ట్రంలోని కొలంబియా(Columbia) ప్రాంతంలో ఓ తెలుగు యువతి దారుణ హత్య(murder)కు గురైంది. నిఖిత గోడిశాల(Nikitha Godishala) అనే యువతి మృతదేహం ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో లభ్యమైంది. ఆమె శరీరంపై కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎల్లికాట్ సిటీలో ఉండే నిఖిత గోడిశాల కనిపించడం లేదంటూ అర్జున్ శర్మ జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 31న తన అపార్ట్‌మెంట్‌లో నిఖితను చివరిసారిగా చూశానని పోలీసులకు చెప్పాడు. అయితే ఫిర్యాదు చేసిన రోజే అర్జున్ శర్మ ఇండియాకు వచ్చేశాడు. పోలీసులకు అనుమానం రావడంతో జనవరి 3న అర్జున్ అపార్ట్‌మెంట్‌లో తనిఖీ చేశారు. అక్కడ నిఖిత మృతదేహాన్ని గుర్తించారు. డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల తర్వాత అర్జున్ నిఖితను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతోంది. అర్జున్ శర్మపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతన్ని పట్టుకునేందుకు అమెరికా ఫెడరల్ అధికారుల సహాయం తీసుకుంటున్నారు. భారత దౌత్యకార్యాలయం నిఖిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన సహాయం అందిస్తోందని తెలిపింది. నిఖిత గోడిశాల కొలంబియాలోని వేద హెల్త్ సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పని చేస్తోంది. ఆమె మూలాలు సికింద్రాబాద్‌కు చెందినవిగా తెలుస్తోంది.


