కలం, వెబ్ డెస్క్ : కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కామెంట్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో అబద్దం చెప్పారని టీడీపీ నేతలు అంటున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్మిషన్ లేకుండానే జగన్ స్టార్ట్ చేశారని చంద్రబాబు చెప్పినవి కూడా పచ్చి అబద్దాలే’ అన్నారు బొత్స సత్యనారాయణ.
రాయలసీమ ప్రాజెక్టును ఆపేసి ఆ ప్రాంత ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేసినట్టు ఒప్పుకున్నారని బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విమర్శించారు. జగన్ హయాంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని ప్రయత్నిస్తే.. ఇప్పుడు చంద్రబాబు వాటిని నాశనం చేస్తూ వస్తున్నారని చెప్పారు. ఇలాంటి అబద్దాలతోనే సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని.. హడావిడి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాయలసీమకు నీళ్లు ఆపడంపై త్వరలోనే పార్టీలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Read Also: ప్యాకేజీలు దండుకోడానికే పార్టీ.. పవన్ పై రోజా ఘాటు వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)


