కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally ) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు అని ఎందుకు ఒప్పుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏపీకి దోచి పెడుతున్నదని కేసీఆర్ అన్నారని.. తోలు తీస్తా అని కూడా కేసీఆర్ అన్నాడని మంత్రి జూపల్లి గుర్తు చేశారు.
అయితే, వాస్తవ పరిస్తితులు తెలంగాణ ప్రజలకు తెలియాలని అసెంబ్లీ చర్చ పెడితే.. సభకు బీఆర్ఎస్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వాళ్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో అసెంబ్లీ సమావేశాలకు బాయ్ కాట్ చేశారని విమర్శించారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం రైతులకు నీళ్లందించడం కంటే కమీషన్లు తీసుకునేందుకే అదిక ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. కమీషన్ల మీద పెట్టిన శ్రద్ధ ప్రాజెక్టుల మీద పెట్టలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ మీద చూపిన ప్రేమ.. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై చూపలేదని మంత్రి (Minister Jupally) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: నల్లమలసాగర్ ప్రాజెక్టుపై లాయర్లతో చర్చలు
Follow Us On: Instagram


