కలం, వెబ్ డెస్క్ : రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాలపై రాజకీయాలు (Krishna Water Dispute) వేడెక్కాయి. నిన్న అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తానే ఆపానని.. నీళ్ల దోపిడీని అరికట్టానని చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాల్లో అలజడి మొదలైంది. ఈ క్రమంలోనే విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నాయుడు (Chandrababu).. కృష్ణా జలాలపై స్పందించారు. త్వరలోనే మీడియా ముందు అన్నీ వివరిస్తానని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో అసలేం జరిగిందో.. తాను ఏం చేశానో ప్రజలకు తెలియజేస్తానని స్పష్టం చేశారు.
చంద్రబాబు కామెంట్లతో రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల వివాదం ముదిరేలా కనిపిస్తోంది. తెలంగాణ నేతలే దీనిపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం కూడా స్పందించడంతో కృష్ణా జలాల అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. నిన్న అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. నేడు హరీష్ రావు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read Also: మరో చాన్స్ మిస్ అయిన బీఆర్ఎస్
Follow Us On: Youtube


