కలం, వెబ్ డెస్క్ : అభం శుభం తెలియని ఓ మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ (Swimming Pool) లో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లి (Kukatpally) పరిధిలోని హైదర్ నగర్ లో చోటు చేసుకుంది. హైదర్ నగర్ లోని గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం మధ్యాహ్నం మూడేళ్ల అర్జున్ అనే బాలుడు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంతో గారాబంగా పెంచుకున్న కుమారుడి మృతితో తల్లదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. బాలుడి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: హరీశ్ ఓ గుంటనక్క.. బీఆర్ఎస్‌లో తనకు ఓ గ్రూప్ : కవిత
Follow Us On: Pinterest


