కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రా వాళ్ళు నదీ జలాలను దోచుకుంటున్నారన్న హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Chandra Mohan Reddy) కౌంటర్ ఇచ్చారు. నదీ జలాలపై బీఆర్ఎస్ ఆరోపణలకు “ప్రజలే బుద్ధి చెప్పారు” అని సోమిరెడ్డి తెలిపారు. ఏడాదికి రెండు నుండి మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతున్నాయి. వృధాగా పోతున్న నీటిని వాడుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టు ప్రపోజల్ పెడితే బీఆర్ఎస్ నాయకులు అన్న మాటలు అన్నీ ఇన్నీ కావు.
గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి రాయలసీమ కోసం వాడుకోండి అని రోజా(roja) ఇంటికెళ్ళి మరీ కేసీఆర్(KCR) చెప్పిన మాటలు మరచిపోయారా.. కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా టీడీపీ నుంచి వెళ్లి ముఖ్యమంత్రులు అయిన వారే అని ఆయన అన్నారు. నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇలా అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని సోమిరెడ్డి తెలిపారు.


