కలం, మెదక్ బ్యూరో : సిద్ధిపేట (Siddipet) జిల్లా మార్కుక్ మండలం ఎర్రవెల్లిలోని (Erravelli) కేసీఆర్ ఫామ్ హౌస్‌ను (KCR Farmhouse) కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ (Gajwel) మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, ఇతర నాయకులు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే వారి కోసం ఏం చేస్తున్నారని నిలదీశారు.
కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి గజ్వేల్ ప్రజల సమస్యలపై గళం విప్పాలంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఫామ్ హౌస్ గేటు ముందే బైఠాయించారు. ఫామ్ హౌస్ గేటు ముందు రెడ్ కార్పెట్ పరిచి పూలు వేసి నిరసన తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇంటి ముందు పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

Read Also: హరీశ్ ఓ గుంటనక్క.. బీఆర్ఎస్‌లో తనకు ఓ గ్రూప్ : కవిత
Follow Us On: Sharechat


