కలం, భద్రాచలం : భద్రాచలం నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (Thakkellapalli Ravindar Rao) పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాచలంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ నాయకులంతా సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ప్రతి అర్హుడైన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేసేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల సమస్యలు, వారి హక్కులు, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి భాగస్వామ్యం తదితర అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అర్హులకు అవగాహన కల్పించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్, నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ, సీనియర్ నాయకులు కోటగిరి ప్రబోధ్ కుమార్, వాజేడు మండల అధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, వెంకటాపురం మండల అధ్యక్షుడు గంప రాంబాబు, చర్ల మండల పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు తదితరులు పాల్గొన్నారు.

