చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం ట్విస్ట్ ఏమిటంటే!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ పట్టణంలోని వెల్‌కమ్ బోర్డు వద్ద ఉన్న సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం (Chakali Ilamma Statue)  దెబ్బతినడానికి కోతులే కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో కోతులు విగ్రహాన్ని పట్టుకుని ఊగడం వల్ల అది దెబ్బతిన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. విగ్రహం దెబ్బతిన్న విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని (CCTV Footage) సేకరించి పరిశీలించారు. అంతేకాకుండా, ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు స్థానిక మహిళల నుంచి కూడా వివరాలు సేకరించారు.

సీసీ కెమెరాల ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం విగ్రహం దెబ్బతినడం వెనుక ఎలాంటి దుండగుల ప్రమేయం లేదని, కోతుల వల్లే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే, ఘటనకు గల అసలు కారణం తెలియకముందే పలు కుల సంఘాలు ధర్నాలు నిర్వహించాయి. రాజకీయ నాయకులు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడవడంతో ఈ ఘటనపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>