కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం కండి: BJP

కలం, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం కావాలని జిల్లా పార్టీ శ్రేణులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం (Saini Mallesham) దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు మంగళవారం రోజున కరీంనగర్ లోని మహాశక్తి దేవాలయ ఆవరణలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. సాయిని మల్లేశం మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీతో ‘సేవా సంకల్ప్ అభియాన్’ ముగియనున్న నేపథ్యంలో పార్టీ నిర్దేశించిన ప్రోగ్రాంలన్నీ విజయవంతంగా పూర్తి చేసేలా , రాబోయే 50 రోజుల పాటు ప్రజా సమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మరింత దూకుడుగా పోరాటాలు నిర్వహించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ఎన్నికల హామీల వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మల్లేశం పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక రాష్ట్ర స్థాయి సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ వైఫల్యాలను గడపగడపకూ తీసుకెళ్లి ఎండగట్టాలని కోరారు.

ఈ నెల 17 తర్వాత రాబోయే 50 రోజుల పాటు అనుసరించాల్సిన వివిధ కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలపై నేతలకు మల్లేశం స్పష్టమైన ప్రణాళికను వివరించారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి చేపట్టబోయే కార్యక్రమాలన్నిటినీ విజయవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ప్రజా ఉద్యమాలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, కన్న కృష్ణ, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, వైదరామానుజం, చేవూరి సత్యం, శ్రవణ్ , ముత్యాల జగన్ రెడ్డి , గుంజేటి శివకుమార్, మైనారిటీ మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ లతో పాటు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంఘ నరేష్ , కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>