కలం, జోగులాంబ గద్వాల: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గద్వాల (Gadwal) పట్టణంలోని జమ్మిచేడు శ్రీజములమ్మ దేవాలయం (Jammulamma Temple ) లో అమ్మవారిని మంగళవారం ధనలక్ష్మి అలంకారం గావించారు. రూ. 9.99 లక్షలు విలువైన కరెన్సీ నోట్లతో విశేష అలంకారం చేశారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈఓ ఆధ్వర్యంలో భక్తులకు మౌళిక వసతులు కల్పించారు.

