ఐఏఎస్ వికాస్ మర్మత్‌పై చంద్రబాబు ఆగ్రహం

కలం, వెబ్ డెస్క్: ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఆయన చేసిన గొడవకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎస్ సాయి ప్రసాద్‌ను ఆదేశించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పట్టణాభివృద్ధి సంస్థ (కడా) ప్రత్యేకాధికారిగా ఉన్న వికాస్ మర్మత్.. బెంగళూరు పబ్‌లో తాగి పోలీసులపై అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో ఆయనపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా, ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై బెంగళూరు సెంట్రల్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కడా పోస్ట్ నుంచి ఔట్..?

ఐఏఎస్ వంటి ఉన్నత హోదాలో ఉన్న వికాస్ మర్మత్ విచక్షణ మరిచి ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు పోలీసులపై ఆయన ప్రయోగించిన భాష చూపి నివ్వెరపోతున్నారు. ఆయనపై ప్రభుత్వం ఇప్పటికే ఆగ్రహంగా ఉండటంతో కుప్పం పట్టణాభివృద్ధి సంస్థ (కడా) ప్రత్యేకాధికారి పోస్ట్ నుంచి ఆయన్ను తప్పించే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన వికాస్ మర్మత్‌ను సీఎం చంద్రబాబు ఏరికోరి కుప్పం ప్రాంతానికి ప్రత్యేకాధికారిగా నియమించుకున్నారు. తన ప్రవర్తనతో ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>