బౌండరీ అనుకుని బుక్కైన తిలక్‌.. రమేష్ ఫైర్!

కలం, స్పోర్ట్స్: బౌండరీ అనుకుని వికెట్ చేజార్చుకున్న తిలక్ వర్మపై మాజీ భారత ఓపెనర్ స‌ద‌గోప‌న్ ర‌మేశ్ (Sadagoppan Ramesh) తీవ్ర విమర్శలు చేశారు. బంతి బౌండరీ దాటిందో లేదో అంపైర్లకే స్పష్టత లేనప్పుడు, తిలక్, అక్షర్ పటేల్ ఎలా నిర్ణయించుకున్నారని ప్రశ్నించారు. తిలక్ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనట్లు కనిపించాడని విమర్శించారు. వెస్టిండీస్‌తో మూడో టీ20లో భారత ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. అక్షర్ పటేల్ కొట్టిన బంతిని ఫీల్డర్ కైల్ పూరన్ డైవ్ చేసి బౌండరీకి వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే బంతి బౌండరీ దాటిందని అక్షర్, తిలక్ భావించారు. దీంతో పరుగులు తీయడం ఆపేశారు.

అక్షర్ వెంటనే అప్రమత్తమై క్రీజులోకి చేరుకున్నాడు. కానీ తిలక్ మాత్రం క్రీజుకు దూరంగా ఉండిపోయాడు. బౌలర్ గుడాకేశ్ మోటీ వికెట్లను పడగొట్టడంతో తిలక్ రనౌట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ సమీక్షలోనూ ఇదే తేలింది. ఈ ఘటనపై రమేష్ స్పందిస్తూ.. అంపైర్లు బంతి బౌండరీ దాటిందో లేదో నిర్ధారించుకోవడానికి థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. బౌండరీకి, అంపైర్ ఉండే ప్రాంతానికి మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో ఫీల్డర్ బంతిని అడ్డుకున్నాడా లేదా అన్నది వెంటనే స్పష్టంగా తెలియదని వివరించారు.

అందుకే బౌండరీ సేవ్ జరిగినప్పుడు అంపైర్లు సాధారణంగా థర్డ్ అంపైర్ సహాయం తీసుకుంటారని తెలిపారు. అంటే బంతి ఇంకా ఆటలోనే ఉందని బ్యాటర్లు గుర్తించాలని సూచించారు. కానీ తిలక్ మాత్రం బీచ్‌లో నడుస్తున్న వ్యక్తిలా కనిపించాడని, చుట్టూ ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదన్నట్లుగా విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>