భార్య వివాహేతర సంబంధం..? పిల్లల ముందే భర్త దారుణం

కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లి (Jalpally) న్యూబాబానగర్‌లో దారుణం జరిగింది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ముస్తఫా (35) అనే వ్యక్తి తన భార్య అజ్మీరా (30)తో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన ముస్తఫా మరోసారి భార్యతో గొడవకు దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. ముగ్గురు పిల్లలు చూస్తుండగానే కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తన సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి, పిల్లలను అక్కడే విడిచిపెట్టి పరారయ్యాడు.

బాలాపూర్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. శ్రీశైలం మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పహాడీషరీఫ్ పోలీసులకు నిందితుడి ఫొటోను పంపించి సమాచారం అందించారు. ఆ ఫొటో ఆధారంగా ముస్తఫాను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భార్యాభర్తల మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>