కలం, వెబ్ డెస్క్ : సింగరేణి (Singareni Bonus) సంస్థ తమ ఉద్యోగులకు భారీ పండుగ కానుకను ప్రకటించింది. ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు దసరా బోనస్‌గా పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ప్రతి రెగ్యులర్ కార్మికుడికి సగటున రూ.1,53,912 అందనుంది.
గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాల ఆధారంగా ఈ బోనస్ చెల్లింపులు చేపడుతున్నారు. సంస్థ గడిచిన ఏడాదిలో రూ.1,754 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది పద్ధతినే అనుసరిస్తూ ఈసారి కూడా 34 శాతం లాభాల వాటాను కార్మికులకు కేటాయించారు. రెగ్యులర్ సిబ్బందితో పాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా తీపి కబురు అందిస్తూ, ఒక్కో కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.5,500 బోనస్ ఇవ్వనున్నారు.

