పాలమూరులో ఆగిపోయిన అభివృద్ధి: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరులో చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులతో కలిసి సోమవారం కేక్ కట్ చేశారు. వైద్య విద్యార్థులతో కలిసి కళాశాలలో విభాగాలను పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి వివరాలతో కూడిన పుస్తకాన్ని విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేశామని తెలిపారు.

ఆసుపత్రి ఇంకా ప్రారంభంచలేదు..

మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్దండాపూర్, కర్వెన రిజర్వాయర్ల పనులు పూర్తి చేశామని వి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. కాలువలు పూర్తి చేస్తే 12 లక్షల ఎకరాలకు నీరు అందుతుందనే విషయం తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయినా.. ఇంకా ప్రారంభించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మెడికల్ కాలేజీని మహబూబ్‌నగర్‌కు ఇచ్చినందుకు కేసీఆర్‌కి కృతజ్ఞతగా ఉండాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శరత్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీను నాయక్ , కుర్వ శ్రీశైలం, శ్రీనివాస్ రెడ్డి, ఇమ్రాన్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>