SIRకి వ్యతిరేకంగా భద్రాచలంలో కాంగ్రెస్ నిరసన

కలం, ​భద్రాచలం: ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా భద్రాచలంలో (Bhadrachalam) కాంగ్రెస్ భారీ నిరసన నిర్వహించింది. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు నేతృత్వంలో సోమవారం పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల హక్కులు ఎంతో విలువైనవన్నారు. ఓటు హక్కును కాలరాసే విధంగా ఉన్న SIR ప్రక్రియపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తెలిపారు.

రాహుల్ గాంధీ పోరాటానికి సంఘీభావంగా కాంగ్రెస్ శ్రేణులు ఏకమై ఈ నిరసనలో పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఓటర్ల హక్కులను కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన విభాగ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>