రబీ సీజన్‌లో వరి సాగు వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే ముద్దు!

కలం, యాదాద్రి కలెక్టరేట్ : రాష్ట్రంలో తక్కువ వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రబీ సీజన్‌లో వరి సాగుకు దూరంగా ఉండాలని, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​ లో యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు.  రాష్ట్రంలోని 315 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

సోమవారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లోని రైతు వేదికల వద్ద ఉన్న అధికారులు, రైతులతో మాట్లాడి వ్యవసాయ పరిస్థితులు, నీటి వినియోగంపై సూచనలు చేశారు.

రబీ సీజన్‌లో వరి సాగు చేయకుండా బిందు సేద్యం ద్వారా పామ్ తోటలు, కూరగాయలు, స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. జలసిరి కార్యక్రమం కింద ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోరు బావుల రీఛార్జ్ పనులు చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటి సమస్యలు రాకుండా ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించాలని, వ్యవసాయ విద్యుత్ సరఫరాపై సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. భూగర్భ జల శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు. త్వరలో కరువు మండలాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

మాసుకుంట రైతు వేదికలో అదనపు కలెక్టర్

భువనగిరి మండలం మాసుకుంటలోని రైతు వేదిక నుంచి నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీ వాణి, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి హేమలత, వివిధ శాఖల అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>