ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం

కలం, వెబ్ డెస్క్: దేశంలోని ఆరు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను (Governor Appointments) నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ఉత్తర్వులు జారీ చేశారు. కేరళం గవర్నర్‌గా ఓం ప్రకాశ్ మాథుర్, తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఒడిశా గవర్నర్‌గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్‌గా సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా డాక్టర్ ధాల్ సింగ్ బిసెన్, సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. తమిళనాడు రాష్ట్రానికి ఇన్‌ఛార్జి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను ఇదే రాష్ట్రానికి పూర్తి స్థాయిలో నియమించారు. కేరళం రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చారు. ఒడిశా గవర్నర్‌గా తెలుగు వ్యక్తి కంభంపాటి హరిబాబు ఉండగా.. ఆయన స్థానంలో బ్రిజ్ మోహన్ రామ్‌ను ఎంపిక చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>