ఎంప్లాయిస్ జేఏసీ విన్నపం.. తక్షణమే అధికారులకు సీపీ ఆదేశాలు

​కలం, ​కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ (CP Gaush Alam)ను ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి పూలమాలలు, శాలువాతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీపీ గౌస్ ఆలం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు మరింత విశిష్ట సేవలందించాలని భగవంతుడిని, అల్లాను ప్రార్థిస్తున్నట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, వారికి ఉద్యోగ భద్రత, న్యాయం చేకూరేలా చూడాలని కోరుతూ ఉద్యోగుల జేఏసీ నాయకులు సీపీకి వినతిపత్రం అందజేశారు. ​జేఏసీ వినతిపై కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఐపీఎస్ తక్షణమే స్పందించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రాధాన్యత ప్రాతిపదికన వేగవంతంగా పూర్తి చేసి నివేదికలు పంపించాలని సంబంధిత పోలీస్ అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు.

ఉద్యోగుల సమస్యపై తక్షణమే స్పందించి సానుకూల ఆదేశాలు జారీ చేయడం పట్ల ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పరిష్కారానికి చొరవ చూపిన సీపీ గారి పనితీరు అభినందనీయమన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మేలు జరిగేలా ఆదేశాలు ఇచ్చిన పోలీస్ కమిషనర్‌కు టీఎన్జీవోల సంఘం, యావత్తు ఉద్యోగుల జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డితో పాటు జేఏసీ కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్విందర్ సింగ్, గూడ ప్రభాకర్ రెడ్డి, నాయకులు లవకుమార్, జీవన్ రెడ్డి, అజయ్, ఆనంద్, రాకేష్, ప్రభాకర్ తదితర ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>