కలం, సోన్ : సోన్ మండలం (Soan Mandal) లోకల్ వెల్మల్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామానికి చెందిన భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ గాయత్రి మాత ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ పాదయాత్రలో గ్రామ సర్పంచ్ గంగయ్య, భవాని దీక్షాపరులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

