కలం, వెబ్‌డెస్క్: జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలో అరెస్ట్ అయిన సందర్భంగా యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee), సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) విడుదలకు ముందు పీస్ బాండ్లపై సంతకాలు చేశారంటూ వచ్చిన వార్తలపై వీరిద్దరూ స్పందించారు. అసలు తాము ఎలాంటి బాండ్లపై సంతకాలు చేయలేదని ఎక్స్ వేదికగా వేర్వేరు పోస్టుల్లో తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా విడుదలకు పలు షరతులు పెట్టారని, ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేయబోమని హామీ ఇస్తూ శాంతి ఒప్పందంపై సంతకాలు తీసుకున్నారని కథనాలు వెలువడ్డాయి.
అయితే తాను ఎలాంటి బాండ్‌పై సంతకం చేయలేదని, మళ్లీ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతానని అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) స్పష్టం చేశారు. ఇక ధ్రువ్ రాఠీ కూడా తాను ఎలాంటి బాండ్‌పై సంతకం చేయలేదన్నారు. అలాగే ఎలాంటి హామీల పత్రంపైనా సంతకం చేయలేదని చెప్పారు. తనను విడుదల చేసేందుకు ఎలాంటి షరతులు విధించలేదని వెల్లడించారు.
Also Read : ఢిల్లీ డీసీపీ చెప్పేవన్నీ అబద్ధాలే.. అభిజిత్ తీవ్ర ఆరోపణలు
Follow Us On: X(Twitter)

