కలం, వెబ్ డెస్క్: 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తమిళనాడులోని చెన్నైలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, స్వయం సమృద్ధి కలిగిన దేశం, ప్రపంచ తయారీ హబ్, ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ, చంద్రుడిపై భారతీయుడి ప్రయాణం.. ఇలా ఏదైనా 2047 నాటికి సాధ్యం కానుంది. మనం కచ్చితంగా చేయగలుగుతాం’ అన్నారు.
ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. ‘పెద్ద కలలు కనాలి.. విభిన్నంగా ఆలోచించాలి.. భయం లేకుండా ఉండాలి’ అనే కవి భారతీయార్ సూక్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. తమిళనాడు ఇంకా అభివృద్ధి చెందాలి. అప్పుడే దేశం కూడా ఇంకా పురోగమిస్తుంది. రాష్ట్రానికి ఏం కావాలన్నా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యం’ అన్నారు.
ప్రధాని మోదీకి సీఎం విజయ్ విజ్ఞప్తి..
సీఎం విజయ్ (CM Vijay) మాట్లాడుతూ.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ మంజూరు చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో గోదావరి–కావేరి నదుల అనుసంధానం కూడా చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లో నీటి కొరత ఉండబోదన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కోయంబత్తూరు, మధురై నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. SSA పథకం కింద కేంద్రం నుంచి ఇంకా తమిళనాడుకు రూ.5,110 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే మంజూరు చేయాలన్నారు. తమిళనాడులోని హోసూరు నుంచి కర్ణాటకలోని బొమ్మసండ్ర వరకు ఇంటర్ స్టేట్ మెట్రో రైల్ నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇవ్వాలని కోరారు.
Also Read : సీఈసీ రాజీనామా కోసం ఆందోళన కొనసాగిస్తాం: ఖర్గే
Follow Us On : WhatsApp

