కలం, స్పోర్ట్స్: భారత్‌తో వన్డేలకు న్యూజిలాండ్ (New Zealand) రెండు జట్లతో సమాయత్తం అవుతోంది. ఇప్పటికే తొలి మూడు వన్డేలకు ఒక జట్టు, ఆ తర్వాత రెండు వన్డేలకు మరో జట్టును ప్రకటించింది. వీటిలో గాయం నుంచి కోలుకున్న రచిన్ రవీంద్రకు కూడా స్థానం దక్కింది. అయితే రెండు జట్లు ప్రకటించడం వెనక కివీస్ భారీ ప్లాన్ ఉంది. ఇది కేవలం ఆటగాళ్ల మార్పు మాత్రమే కాదు. వన్డే ప్రపంచకప్ సన్నాహాలు, టెస్టు సిరీస్ కోసం ఆటగాళ్లను సిద్ధం చేయడం ఈ నిర్ణయం వెనుకున్న అసలు కారణాలు. మూడో వన్డే తర్వాత కొందరు ఆటగాళ్లు టెస్టు సన్నాహాల కోసం వెళ్లనున్నారు. దీంతో చివరి రెండు మ్యాచ్‌లకు ఏడుగురు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేశారు. రెండు జట్లకూ మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
తొలి మూడు వన్డేలకు జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.
చివరి రెండు వన్డేలకు జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, లాకీ ఫెర్గూసన్, మిచ్ హే (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.
తొలి మూడు వన్డేలకు ఎంపికైన రచిన్ రవీంద్ర భుజం గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సీఫర్ట్ చివరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు. ఈ సిరీస్ నవంబర్ 4న ఆక్లాండ్‌లో ప్రారంభం కానుంది.
Also Read : యునిసెఫ్‌తో స్మృతి కొత్త ప్రయాణం.. బాలికల కోసమే!
Follow Us On: Instagram

