కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో షాకింగ్ రోడ్డు ప్రమాదం (Tamil Nadu Accident) జరిగింది. తూత్తుకుడి జిల్లా శాత్తాన్‌కుళం ప్రాంతంలో రోడ్డు పక్కన బైక్‌పై కూర్చుని ఒక యువకుడు ఫోన్ చూస్తున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ఆ యువకుడి బైక్‌ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది.
ఊహించని ఈ ప్రమాదంలో ఆ యువకుడు చిన్న గాయం కూడా కాకుండా తృటిలో సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ భయానక ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఏఐ వీడియో అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేయడం గమనార్హం.
Also Read : పోరాటం ఆపబోం.. కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటన
Follow Us On : WhatsApp

