కలం, వెబ్ డెస్క్ : ఫారెస్ట్ అధికారులు పెద్ద మొత్తంలో లంచాలకు తెర తీశారు. చివరకు ఏసీబీ (ACB) వలకు చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెంలో (Bhadradri Kothagudem) జామాయిల్ చెట్ల కటింగ్ కు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ ఉంటుంది. ఆ బిల్లులను ఫారెస్ట్ అధికారులు అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. దీన్నే అదునుగా తీసుకున్న డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి లంచాలు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారని కాంట్రాక్టర్లు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి టన్నుకు ప్రభుత్వం రూ.750 చెల్లిస్తే.. అందులో రూ.150 తనకు ఇవ్వాలని శ్రావణి కండీషన్ పెట్టింది. కానీ రూ.90 మాత్రమే ఇస్తామని కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు. ఫస్ట ఫేజ్ లో 3900 టన్నులకు గాను రూ.3.51 లక్షలు లంచం ఇవ్వాలని శ్రావణి డిమాండ్ చేసింది. చేసేది లేక కాంట్రాక్టర్లు ఏసీబీని ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటున్న టీఎఫ్ డీసీ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, చెన్నారావు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి డబ్బులు తీసుకోడానికి రాకుండా వీరిద్దరినీ పంపించిందని అధికారులు తెలిపారు. వీరిద్దరినీ ఏ2, ఏ3గా పేర్కొన్న అధికారులు శ్రావణిని ఏ1గా పేర్కొన్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచారు.

Read Also: డబ్బులు త్రిబుల్ చేస్తానని నమ్మించి.. 55లక్షలు మోసం
Follow Us On : WhatsApp


