ఢిల్లీ నిర్బంధం.. కేంద్ర ప్రభుత్వానికి వాంగ్​చూక్​ డెడ్‌లైన్

నేషనల్ డెస్క్: ఢిల్లీలో విద్యార్థి నాయకులు, కార్యకర్తలను పోలీసులు నిర్బంధించడాన్ని ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చూక్ (Sonam Wangchuk) శనివారం తీవ్రంగా ఖండించారు. ఇది దేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ లాంటిది అని ఆయన అభివర్ణించారు. అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. లేనిపక్షంలో తాను మరోసారి ఆమరణ నిరాహార దీక్ష లేదంటే పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఉద్యోగాన్ని, ఉద్యమాన్ని నడిపించడానికి ఎంతోమంది నాయకులు ఉన్నారని నేను సంతోషపడ్డాను. కానీ వారందరినీ ఇప్పుడు అరెస్టు చేశారని తెలిసింది. అరెస్టయిన వారందరూ త్వరలోనే విడుదలవుతారని నేను ఆశిస్తున్నాను.

ఒకవేళ ఆదివారంలోగా వారిని విడుదల చేయకపోతే.. లేహ్‌లో లేదంటే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష, పాదయాత్ర చేపట్టక తప్పదు’’అని వాంగ్‌చూక్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘‘మొన్నటి ప్రొటెస్ట్​కు ముందు శాంతియుతంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేశా. శాంతియుత నిరసనలకు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం అనుమతిస్తుందని నమ్మాను. కానీ, ఇది ప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితిలా అనిపిస్తున్నది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న’’అని వాంగ్​చూక్​ స్పష్టం చేశారు.

జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోజ్​ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ముందుగానే.. అర్వింద్​ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, పినరయి విజయన్, నేహా బోరా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్​తో పాటు పలువురు రాజకీయ నాయకులు, నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>