కాఫీ షాప్‌లో సీఎం విజయ్, రాహుల్ సందడి!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెన్నైలో సందడి చేస్తున్నారు. ఇద్దరు కలిసి పాలవక్కంలోని ‘బాస్క్ బై కాఫీ’ షాప్‌కు వెళ్లారు. ఇద్దరు అగ్ర నేతలు అక్కడకు రావడంతో వారితో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. సీఎం విజయ్ ఓపిగ్గా.. అందరితో ఫొటోలు దిగుతూ హాయ్ చెబుతూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతున్నాయి.

కాఫీ షాప్‌లో సీఎం విజయ్(CM Vijay), రాహుల్ గాంధీ టిరమిసు జార్ (తీపి డెజర్ట్), క్యాపచ్చినో (పాలతో చేసే వేడి కాఫీ), ఐస్డ్ అమెరికానో డిజర్ట్‌(ఐస్‌తో బ్లాక్ కాఫీ) ఆర్డర్ చేసి ఆస్వాదించారు. సాయంత్రం యువతతో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ మధ్యాహ్నమే చెన్నై చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా నీలంకరైలోని సీఎం విజయ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాఫీ షాప్‌కు వెళ్లారు. మరికాసేపట్లో ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొని మాట్లాడబోతున్నారు.

Also Read : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. ఢిల్లీలో ఉద్రిక్తత!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>