డ్రీమ్ బైక్ కొన్న పాస్టర్.. అసలు ట్విస్ట్ ఇదే!

కలం, వెబ్ డెస్క్ : మూడేళ్ల పొదుపు, పది రూపాయల నాణేలపై ఉన్న ప్రత్యేక సెంటిమెంట్ ఓ వ్యక్తి కల నెరవేరేలా చేసింది. మంచిర్యాల (Mancherial) జిల్లా లక్షెట్టిపేటకు చెందిన పాస్టర్ రవి జోసెఫ్ గత మూడేళ్లుగా దాచుకున్న 10 రూపాయల నాణేలతో తనకు ఇష్టమైన బైక్‌ను కొనుగోలు చేశారు.

రూ.1.23 లక్షల విలువైన బైక్ కొనుగోలు చేయడానికి ఆయన పూర్తిగా పది రూపాయల నాణేలనే ఉపయోగించారు. అక్టోబర్ 10న ప్రత్యేక సెంటిమెంట్‌తో ఈ నాణేల సంచులను తీసుకుని నేరుగా షోరూమ్‌కు వెళ్లారు. పెద్ద మొత్తంలో వచ్చిన చిల్లర నాణేలను చూసి షోరూమ్ సిబ్బంది తొలుత ఆశ్చర్యపోయినా, ఆయన ఆశయాన్ని గుర్తించి నాణేలను స్వీకరించారు. ఆ నాణేలన్నింటినీ ఒకచోట చేర్చి లెక్కించడానికి షోరూమ్ సిబ్బందికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. చివరకు లెక్క పూర్తయ్యాక సంతోషంగా బైక్ తాళాలను ఆయనకు అందించారు.

Also Read : ‘రణబాలి’ ట్రైలర్‌కు లోకేశ్ ఫిదా.. విజయ్ అదిరిపోయే రిప్లై!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>