‘రణబాలి’ ట్రైలర్‌కు లోకేశ్ ఫిదా.. విజయ్ అదిరిపోయే రిప్లై!

కలం, సినిమా: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా ట్రైలర్‌పై (Ranabaali Trailer) ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రశంసలు కురిపించారు. 1800ల నాటి రాయలసీమ ప్రాంతాన్ని, బ్రిటిష్ పాలనలో కరువు, అణచివేతతో ప్రజలు ఎదుర్కొన్న హృదయవిదారక పరిస్థితులను ట్రైలర్‌లో అద్భుతంగా చూపించారని కొనియాడారు. సీమ మట్టి నేపథ్యానికి తగ్గట్టుగా విజయ్ దేవరకొండ ఎంతో సహజంగా, శక్తివంతంగా కనిపించారని లోకేశ్ పేర్కొన్నారు. ఆయన పాత్రకు రష్మిక మందన్న చక్కగా తోడయ్యారని ప్రశంసించారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో పాటు చిత్రబృందాన్ని అభినందిస్తూ.. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

లోకేశ్ ప్రశంసలపై విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) స్పందిస్తూ.. “లోకేశ్ అన్నా.. సీమ నేల నాకు ఎంతో ఇచ్చింది. ఈ నేల కోసం ఈ సినిమా (Ranabaali) చేయాల్సిన సమయం వచ్చింది. మీ సందేశం మా అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది. మన నేల, మన ప్రజల గురించి గర్వపడేలా చేసే గొప్ప సినిమాటిక్ అనుభూతి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది” అని పేర్కొన్నారు. అలాగే తనపై చూపిన ప్రేమకు, అభినందనలకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : సీఎం రేవంత్ పై ఆరోపణలు.. మెడికవర్ హాస్పిటల్ సంచలన ప్రకటన!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>