ఎకో టూరిజం డెవలప్‌మెంట్.. ప్రజాభవన్‌లో భట్టి సమీక్ష

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఎకో టూరిజం ప్రాజెక్టులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమక్షంలో అటవీ శాఖ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ సంజయ్ జాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యావరణహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న ఎకో టూరిజం ప్రాజెక్టులను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఎకో టూరిజం ప్రాజెక్టులు, ప్రకృతి అందాలు, పర్యాటక ఆకర్షణలు, సందర్శకులకు అందుబాటులో ఉన్న అవకాశాలను పీపీటీ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ ఐటీ దిగ్గజాలకు అధికారులు వివరించారు.

ఎకో టూరిజం ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై వివరించారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాలను డిజిటల్‌ వేదికలపై అన్వేషించేలా ప్రోత్సహించడంపై చర్చించారు. ఐటీ రంగంలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తెలంగాణ ఎకో టూరిజం ప్రాజెక్టులకు మరింత ప్రచారం కల్పించడం, పర్యాటక అవకాశాలను విస్తరించడంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో అటవీ దళాధిపతి వినయ్ కుమార్, సీసీఎఫ్‌లు శరవణన్, ప్రియాంక వర్గీస్, క్షితిజ, పర్యాటక శాఖ డైరెక్టర్ రంజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>