కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణ ఏర్పాటు: బిగాల గణేష్

కలం, నిజామాబాద్ బ్యూరో: కేసీఆర్ సంకల్పం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) అన్నారు. నూతన జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిజామాబాద్‌ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు.

బిగాల గణేష్ గుప్తాతో పాటు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ ఆమీర్, వీజీ గౌడ్ హాజరయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా సుజిత్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, విశాలిని రెడ్డి, సత్య ప్రకాష్ ఇతర ఉద్యమకారులకు సన్మానం నిర్వహించారు. మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్, పట్టణ అధ్యక్షులు సిర్ప రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ‘చరిత్ర తెలుసుకోండి’.. అమెరికాకు భారత్ కౌంటర్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>