నిజ నిర్ధారణ తర్వాతే వార్తల ప్రచురణ ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : మీడియా ప్రతినిధులు (Journalists) వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిజ నిర్ధారణ చేసిన తర్వాతే ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) సూచించారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీసీ హాల్‌లో నిర్వహిస్తున్న రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.  సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు.

ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకుంటూ, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డీపీఆర్వో విష్ణు వర్ధన్, మీడియా అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : వంట చేసిన కేటీఆర్.. ఎవ‌రి కోస‌మంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>