కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని ఆర్యనగర్‌లో గల ఫ్యూచర్ లైన్ పాఠశాల (Future Line School) లో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల (Future Line School) డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను చాటిచెప్పే బతుకమ్మ పండుగను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్ల చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాలలో ఈ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు.
బతుకమ్మ పాటలు, ఆటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించడంతో పాటు, మన తెలంగాణ వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని డైరెక్టర్ ప్రియాంక పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్వప్న, లావణ్య, గౌతమి, మాధవి, శిరీష, విద్యార్థినులు పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
Also Read : కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు
Follow Us On: Instagram

