దుబ్బాకలో విద్యుత్ కోతలపై ఎమ్మెల్యే ఆగ్రహం

కలం, మెదక్ జిల్లా : దుబ్బాక (Dubbaka) నియోజకవర్గంలో విద్యుత్ కోతల (Power Cuts) కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సాగునీరు అందక పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని.. రాత్రివేళల్లో కూడా విద్యుత్ కోసం రైతులు పొలాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ కోతలను నిరసిస్తూ, వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్బర్‌పేట–భూంపల్లి చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ భారీ రైతు ధర్నా నిర్వహించింది. రైతుల పంటలను కాపాడాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..

విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల వ్యవసాయ మోటార్లు, విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని, రైతులకు అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సాగునీటి సమస్యలను పరిష్కరించి రైతుల పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ రైతాంగానికి అండగా నిలుస్తుందని, అవసరమైతే రైతుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, సర్పంచులు, పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని నినాదాలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>